మేఘ సందేశం



కాళిదాసు మేఘసందేశం 


కశ్చిత్కాంతా  విరహ గురునా స్వాదికారత్ ప్రమత్తః 
శాపేనాస్తం గమిత మహిమా వర్ష భోగ్యేణ భర్తుహ్ 
యక్ష శ్చక్రే  జనకతనయా స్నాన పుణ్యోదకేషు 
స్నిగ్ద చ్చయా తరుషు వసతిం రామ గిర్యాశ్రమేషు (౧)

ఒకానొక యక్షుడు తన కర్తవ్యాన్ని అలక్ష్యం చేయటం వలన తన ప్రభువు  యొక్క శాపానికి గురుయైనాడు . ఆశపాన్ననుసరించి అతడు ఒక ఏడాది పాటు తన ప్రియమైన అర్ధాంగికి దూరంగా గడపాల్సిన ఉంది . శాపకారణంగా తన దివ్యత్వాన్ని కోల్పోయిన ఆ యక్షుడు శాపావధి ముగిసే వరకు జనకతనయ స్నానం చేత పవిత్రతను సంతరించుకున్న జలాశయాలు కల్గినది , చిక్కని ,చక్కని నీడనిచ్చే తరు సముదాయంతో కుడుకోనినవి అయిన రామగిరి ఆశ్రమ ప్రాంతాల్లో తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు .

తస్మిన్నద్రౌ కతిచిదబలా విప్రయుక్త స్స కామీ 
నిత్వా మాసాన్కనక వలయ భ్రంశరిక్త ప్రకోస్స్తః
ఆషాడస్య ప్రధమ దివసే మేఘ మాశ్లిస్థ సానుం 
వప్ర క్రీడా పరిణత గజ ప్రెక్శనీయమ్ దదర్శ (౨)

ప్రేయసిని ఎడబాసిన ఆ ప్రేమికుడు కొన్ని మాసములు ఆ రామగిరి పర్వతం పైన గడిపాడు . విరహవేదనతో చిక్కిపోయిన అతని ముంజేతి నుంచి కంకణం జారి పోయినది. అది కుడా గ్రహించలేని మానసిక స్త్తితి ఆ యక్షునిది . అలా రోజులు గడుపుతున్న ఆ యక్షునికి ఆషాడం మొదటిరోజు ఒక మనోహర దృశ్యం కనపడింది . అక్కడ కొండచరియపైన ఒక మేఘం వుంది . ఆ మేఘం ఎలావుందంటే వప్రక్రీడలో వున్న ఏనుగులాగా చూడ ముచ్చటగా వుంది .

తస్య స్థిత్వా కథమపి పురః కౌతుకాదాన హేతో 
రంతర్భాష్ప్హ  శ్చిరమనుచరో రాజరాజస్య దధ్యౌ 
మేఘా లోకే భవతి సుఖినో ప్యన్యదా వృత్తి చేతః 
kamtaa   శ్లేష ప్రణయిని జనే కిం పునర్డూర సంస్థే (౩) 


తన కన్నీళ్లను లోపలే దాచుకొని కుబేరుని అనుచరుడైన ఆ యక్షుడు ఉత్సాహాన్ని కలిగించే ఆ మేఘాన్ని తదేకంగా చూస్తూ ఆలోచిస్తూ అలా ఉండిపోయాడు .  మేఘాన్ని చూసినంతనే సుఖంగా వున్నా వ్యక్తి మనసు కూడా ఏదో ఆరాటానికి లోనవుతుంది . అలాటిది కౌగిలిలో బంధించాల్సిన ప్రణయిని గాని , ప్రియుడుగాని ఎక్కడో దూరంగా వుంటే  వారి పరిస్తితిని యేమని చెప్పాలి .

ప్రత్యాసన్నే నభసి దయితా జీవితలమ్బనార్ద్ధీ 
జీమూతేన స్వకుశలమయీమ్ హారయిష్యన్ ప్రవృత్తిం 
స ప్రత్యగ్రెహ్ కుతజకుసుమైహి కల్పితార్ఘాయ తస్మై 
ప్రీతః ప్రీతి ప్రముఖ వచనం స్వాగతం వ్యాజహార (౪)

మేఘాన్ని చూడగానే యక్షునకు అర్ధమైంది . శ్రావణమాసం సమీపిస్తుందని, తనకు దూరమైన ప్రేయసి ప్రాణాలు నిలపాలని , తన కోసం తపించే ప్రియతమకు తన క్షేమ సమాచారాన్ని అందజేయలనుకున్నాడు . ఎదురుగా మేఘుడు కన్పించాడు. ఆ మేఘం ద్వారానే తన ప్రాణ ప్రియకు సందేశాన్ని పంపాలనుకున్నాడు . అందుచేత అప్పుడే వికసించిన అడవిమల్లెలను అర్గ్ఘ్యంగా చెతబూని ఆనందంగా ప్రియమైన వాక్కులతో ఆ మేఘునకు స్వాగతం పలికాడు .



ధూమ జ్యొథిః   సలిల మరుతాం సన్నిపాతః క్వ మేఘః 
 సందేశార్ధాః క్వా పటు కరణైహ్ ప్రణిభిః ప్రాపనియః 
ఇత్యౌత్సుక్యా దపరిగనయన్గుహ్యకస్తం  యయాచే 
కామార్తా  హి ప్రక్రుతి క్రుపనాశ్చేతనా చేతనేషు  (౫) 

దుమ్ము , ప్రకాశము, జలము, వాయువు, సమ్మేళన రూపమైన  మేఘం ఎక్కడ , సమర్ధమైన ఇంద్రియములు కలిగిన ప్రాణుల చేత పంపించదగిన సందేశాలు ఎక్కడ ? ఈ విషయాన్నీ విరహోత్కంతతతో వున్నయక్షుడు గమనించ లేకపోయాడు . అందుచేత ఆ మేఘాన్నే సందేశాన్ని తీసుకు వెళ్ళమని అర్ధించాడు . నిజమే కదా కామార్తులు సహజంగానే చేతానా చేతనాలకు  గల భేదాన్ని గ్రహించలేని మోహమయ దశలో వుంటారు 


జాతం వంశే భువనవిదితే పుష్కరావర్తకానాం  
జానామి త్వాం ప్రకృతి పురుషం కామ రూపం మఘోనః 
తేనార్దిత్వం త్వయి విధివశాత్ దూరబందుర్గతోహం 
యాచా జ్ఞామోఘా వరమదిగుణే లబ్ధకామా (౬)

విశ్వ విఖ్యాతమైన పుష్కరావర్తకముల వంశములో నీవు జన్మించావని  నేనెరుగుదును . అంతేకాదు ఇంద్రుని సచివులలో ఒకనివని , అతని ఆస్థానంలో ప్రముఖ వ్యక్తివని కూడా నాకు తెలుసును. కోరిన రూపం ధరించే శక్తి నీకున్నది అదృష్ట వశాత్తు దివ్య లోకానికి చెందిన నీతో నాకు దూరపు బంధుత్వం కుడా ఉంది. ఆ భాన్దవ్యాన్ని పురస్కరించుకొని నేను నిన్ను ప్రార్ధిస్తున్నాను . ఎందుచేతనంటే అధములను యాచించి కోరినది పొందే కన్నా మహాత్ములను ఆర్జించి కోరినది పొందలేక వట్టి చేతులతో వెళ్ళినా అది మంచిదే .


సంతప్తానం త్వమసి  శరణం తత్పయోద ప్రియాయాః 
సందేశం మే హర ధనపతి క్రోధ విశ్లేషితస్య
గంతవ్యా తే వసతిరలకా నామ యక్షేశ్వరాణామ్
బాహ్యోద్యాన స్థిత  హర శిరశంద్రికా దౌత హర్మ్యా   (7)

సందేశాన్ని ఎక్కడకు తీసుకువెళ్ళాలో  ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు కవి. ఓ జలదా తపిమ్చిపోయినవారికి పిపాసను తీర్చి రక్షిమ్చేవాడవు నీవు. సంతప్తులకు నీవే శరణం . అందుచేత శాపానికి గురిఅయి , ప్రియురాలి నుండి విడివడి తపించిపోతున్న నాకు కూడా దిక్కు నీవె. నా సందేశాన్ని నా ప్రియతమ వద్దకు  తీసుకోనివేల్లుము . నీవువెల్లల్సిన్ది అలకాపురి. అది యక్షుల నివాసస్థానము .ఆ నగరం ఎంతో పునీతమైనది. నగరం వెలుపల ఉద్యానవనంలో ప్రతిష్టితుడైన చంద్రమౌలీస్వరుని శిరసునలంకరిమ్చిన చద్రునియోక్క వెన్నెలలు ఆ నగరంలోని భవనాలను స్వచ్చమైన ధవళ కాంతితో మెరిసిపోయినట్లు చేస్తున్నాయి .  



త్వమా రూడం పవన పదవీ ముద్గ్రుహీతాలకాంతాః
ప్రేక్షిష్యంతే పధిక వనితాః ప్రత్యయాదాశ్వ సంత్త్యః  
కః సన్నద్ద్యౌ విరహ విదురాం  త్వయ్యుపెక్షేత జాయాం
న స్యాదంయో వ్యహమివ జనో యః పరాధీన వ్రుత్థిహ్ (8)

కాశంలో కెగసి వాయుమార్గాన్ని చేరిన నిన్ను ప్రవాసంలో వున్నా  బాటసారుల భార్యల నుదిటమీద పడే ముంగురులను పైకి సరిజేసుకుంటూ , చూస్తూ ఊరట చెందుతారు. నిన్ను చూడగానే వారికీ ఇక తమ భర్తలు తొందరలోనే తిరిగి వస్తారు అనే నమ్మకం ఏర్పడుతుంది. అంతేకాదు , సంనద్దుదవై వున్న నిన్ను చూసిన తరువాత  ఎవడుమాత్రం  విరహార్తితో వున్న తన భార్యను వుపెక్షించగలడు. ఎవడైనా నాలాంటి పరాదీన వృత్తిలో వుంటే తప్ప సాధారణ జనుడు ఎవడూ అలా భార్యను వదలి దూరంగా ఉండలేడు

తాం చావశ్యం దివస గణనా తత్పరామేక పత్నీ 
మవ్యాపన్నా మవిహత గతిర్డ్రక్ష్యాసి భ్రాత్రు జాయాం
ఆశా బంధః కుసుమసదృశం ప్రాయశోహ్యంగనానాం
సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ధి  (9)

మరియు నీవు అక్కడికి వెళ్లి రోజులు లేక్కబెట్టుకుంటూ ఎలాగో ప్రాణాలు నిలుపుకొని వున్న నీ ఈ సోదరుని భార్యను నిరభ్యంతరంగా అవశ్యం చూడగలవు. యువతుల ప్రేమమయ హృదయాలు సుమ సుకుమారాలు . ఏ చిన్నపాటి విరహ వేదనకైనా చిరుగాలి తాకిడికి పూవులా రాలి క్రింద పడబోయ్తట్లుగా వుంటాయి . అలాంటి హృదయాన్ని కుసుమాన్ని వృంతం (కాడ) నిలిపినట్లుగా ఆశ అనే  బంధం పట్టుకుని పడిపోకుండా నిలిపుతుంది 










l

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు