అగజానన పద్మార్కం అర్థం


గణేశ శ్లోకం: అర్థం 

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం 
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే 
ప్రతి పదార్ధం: అగజ = పార్వతి; 'గ' అంటే గమించేది లేదా చలించేది. 'అగము' = గమించ లేనిది లేదా చలించలేనిది (అనగా అచలమైనది) ఈ సందర్భంలో 'కొండ' లేదా 'పర్వతం' అని అర్ధం. 'జ' అంటే పుట్టినది. 'అగజ' అంటే కొండ లేదా పర్వతము నకు పుట్టినది = పర్వత తనయ = పార్వతి. ఆనన = ముఖము; పద్మ = కమలము, తామర పువ్వు; ఆర్కం = సూర్యుడు; గజ = ఏనుగు; ఆననం = ముఖము; అహః = దినము/పగలు; నిశం = రాత్రి; అనేక = చాల; దం = ఇచ్చునది/ఇచ్చువాడు (వరములు) ; తం = అతని; భక్తానాం = భక్తుల కొరకు; ఏక = ఒకే; దంతం = పన్ను/దంతము; ఉపాస్మహే = ఉపాసింతును/పూజింతును.
తాత్పర్యం: గజ ముఖుడైన వినాయకుని పగలు రాత్రి చూస్తున్న పార్వతీ దేవి ముఖము... సూర్యుని చూసిన పద్మము వలె వికసించినది. అన్ని వరములను తన భక్తులకు ఒసగే ఆ ఏకదంతుని ప్రార్థించెదను. 
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం 
అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే 
అ =లేనిది, గ=చలనము ( అంటే చలనము లేలిది=పర్వతము=హిమాలయము=దానికి రాజైన హిమవంతుని ) జ= కుమార్తె (అనగా పార్వతీదేవి) ఆనన= ముఖమను పద్మ= పద్మమునకు అర్కం= సూర్యుడైనట్టి( సూర్యుని చూస్తే తామరలు అనగా పద్మములు వికసించును. అంటే ఆ కొడుకును చూస్తే ఆ తల్లికంత ప్రేమ.) గజ +అనననం =ఏనుగు ముఖము కల్గిన (నిన్ను) అహస్+నిశం = పగలూ రాత్రి అంటే రోజంతా అనేకదం= ఎంచ వీలు లేనంత తం =తమరి, మీయొక్క భక్తానాం = భక్తులలో ఎకదం= ఒకడు తం= తమరిని ఉపాస్మహే= ప్రార్థించుచున్నాడు
ఈ శ్లోకములో అనెకదంతం అని ఎకదంతమని చదువరాదు. అనేకదం తం అని ఎకదం తం అని చదువవలెను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు