ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ జయంతి
రాజా రవి వర్మ | |
జననం | 29, ఏప్రిల్ 1848 కిలమానూర్,కేరళ,ఇండియా |
---|---|
మరణం | అక్టోబర్ 2,1906 కిలమానూర్,కేరళ,ఇండియ |
వృత్తి | |
భార్య/భర్త | రాణీ భాగీరథీబాయి(కోచు పంగి అమ్మ) |
సంతానం | ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
తండ్రి | నీలకంఠన్ భట్టాద్రిపాద్ |
తల్లి | ఉమాంబ తాంబురాట్టి |
పేరు తెచ్చిన చిత్రాలు
క్రింది చిత్రాలు రాజా రవివర్మ కు ఎంతో పేరు తెచ్చినవి:
- పల్లె పడుచు
- అలోచనలో మునిగిపోయిన స్త్రీ
- దమయంతి హంస సంవాదము
- వాద్యకారుల బృందము
- సుభద్రార్జునులు
- లేడీ విత్ ఫ్రూట్స్
- హార్ట్ బ్రోకెన్
- స్వర్బత్ ప్లేయర్
- శకుంతల
- శ్రీ కృష్ణ రాయబారము
- రావణ జటాయు వధ
- ఇంద్రజీత్ విజయము
- బిక్షకుల కుటుంబము
- లేడీ ప్లేయింగ్ స్వర్బత్
- గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ
- వరుణుని జయించిన రాముడు
- నాయర్ల స్త్రీ
- శృంగారంలో మునిగిన జంట
- కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది
- శంతనుడు మత్స్యగంధి
- ప్రేమలేఖ వ్రాస్తున్న శకుంతల
- కణ్వుని ఆశ్రమములోని బాలిక.(ఋషి కన్య).
బాల్యము
రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరురాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు ఏప్రిల్ 29, 1848న జన్మించాడు. చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్ఛ్యాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.
వృత్తి
1873 వియన్నా చిత్ర ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చాడు.ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్తి పొందింది.
0 కామెంట్‌లు