'విమానాన్ని' ఎవరు కనుగొన్నారు - ఋగ్వేదంలో

'విమానాన్ని' ఎవరు కనుగొన్నారు

'విమానాన్ని' ఎవరు కనుగొన్నారు "రైట్" బ్రదర్స్ '17 డిసంబర్ ,1903 నాడు మొట్టమొదటి విమానాన్ని ఎగిరించారు అని చెబుతారు. 
కానీ... ఋగ్వేదం 36 వ సూక్తం లోని ప్రథమ తంత్రము యొక్క అర్థము : మూడు చక్రాలతో అంతరిక్షములో విహరించే రథాన్ని (విమానాన్ని) ఋభువులు (వసువులు) అనే వారు నిర్మించారు అని చెబుతుంది. పురాణాలలో దేవీ-దేవతలు,యక్షులు,విద్యాధరులు,మొదలగు వారు విమానాల ద్వారా ప్రయాణం చేయటం,త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు మూడు అజేయ నగరాలను నిర్మించారని,అవి నింగి,నెల,నీటిలో ప్రయానించేవని,వీటిని శివుడు ధ్వంసం చేసాడని,రామాయణములో ఉన్న పుష్పక విమానం,మహాభారతములో ఉన్న జరాసంధుల విమానం,కర్దముడనే ఋషి తన భార్యతో  విమానములో విహరించటం వంటి విశేషాలు ఉన్నాయి. ఇటువంటి  సంపూర్ణ విశ్వాన్ని చూపించిన గొప్ప విద్యా వ్యవస్థ భారతదేశానిది.  కాని ఆనాడు బ్రిటిష్ కాలములో ప్రవేశపెట్టిన సిల్లబస్ నే మన విద్యగా భావించటం వలన మన ప్రాచీన కాల విద్యా విశేషాలు తెలుసుకోలేకపోతున్నాం. ఇక భారతీయ ఋషి పరంపర వైజ్ఞానిక విషయానికి వస్తే "భరద్వాజ మహర్షి" రచించిన "యంత్ర సర్వస్వం" అనే గ్రంథములోని ఒక భాగమైన "వైమానిక శాస్త్రం" . ఈ గ్రంథం 8 అధ్యాయాలుగా విభజించబడియున్నది. దానిలో 100 అధికరణములు,500 ల సూత్రములున్నవి.  నారాయణ కృత - విమాన చంద్రిక, శౌనక కృత - వ్యోమయాన తంత్రం, గర్గ కృత - యంత్ర కల్పం. వాచస్పతి కృత - యాన బిందు,  చక్రాయణీ కృత - ఖేటయాన ప్రదీపికా,  ధుండీనాథ కృత - వ్యోమయానార్క ప్రకాశికా.  భరద్వాజ మహర్షి ఈ గ్రంథములో విమానం యొక్క నిర్వచనం,విమానం యొక్క పైలట్ (ఇతనిని రహస్యజ్ఞ అధికారి అని పేర్కొన్నారు ),ఆకాశ మార్గం,వైమానిక దుస్తులు,విమాన యంత్ర భాగములు,ఇంధనము,యంత్రము,దాని నిర్మాణములో ఉపయోగించే ధాతువులు - మొ.లగు వన్నీ పేర్కొన్నారు. విమానాలను యుగానుసారంగా విభజించబడిన వాటిని క్రోడీకరించి ఒకచోట చేర్చారు. అవి కృత ,త్రేతా యుగములలో "మాంత్రిక" అను రకమైన విమానాలు, ద్వాపర యుగములో "తాంత్రిక" అను రకమైన విమానాలు(ఇవి 56 రకాలు),  అట్లే కలియుగములో "కృతిక" అనే రకపు విమానాలు ఉంటాయి. ఇవి యాంత్రికాలు.-వీనిలో 25 రకాలుంటాయి.వీనిలో శకున,రుక్మ,హంస,పుష్కర,త్రిపుర మొ.లగునవి ముఖ్యమైనని వివరించారు.
'భరద్వాజ మహర్షి' తన కంటే పూర్వమే విమాన శాస్త్ర విషయ రచనలు గావించిన ఆచార్యులను,వారి రచనలు పేర్కొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు