బ్రాహ్మణ పూజారులకు దీదీ వరాల జల్లు..NTV NEWS
బ్రాహ్మణ పూజారులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంతో పాటు ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 8000 మంది బ్రాహ్మణులు లబ్ది పొందనున్నారు. ఇక 2021లో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీదీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.రాష్ట్రంలో సాహిత్య అకాడమీ తో పాటూ దళిత సాహిత్య అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నేడు హిందీ భాష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దీదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏదో ఒక భాషకు ప్రాధాన్యత ఇవ్వబోదని, అన్ని భాషలకు సమప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
0 కామెంట్‌లు